వెరీ గుడ్ న్యూస్ : 20 నుంచి హైటెక్ సిటీ మెట్రో సర్వీసులు

ట్రాఫిక్‌కు చెక్ పెట్టి.. గమ్య స్థానాలకు వేగంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో ఆరంభమైన మెట్రో ప్రాజెక్టులో ఓ ప్రఖ్యాత దినంగా మారనుంది మార్చి 20. భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఉన్న ప్రాంతంలో మెట్రో కోసం ఎదురుచూపులకు చెక్ పెట్టనున్నారు. మార్చి 20న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ వెళ్లనున్న రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు.
Read Also : టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) రూట్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రూట్‌తో ప్రయాణానికి మరింత సౌలభ్యం లభించనుంది. అమీర్‌పేట, హైటెక్‌సిటీ 11 కి.మీల మేర ప్రయాణంలో 8 స్టేషన్లు ఉన్నాయి.
- మధురానగర్
- యూసుఫ్‌గూడ
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు
- పెద్దమ్మ గుడి
- మాదాపూర్
- దుర్గం చెరువు
- హైటెక్‌సిటీ
హైదరాబాద్‌లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. మొదటి దశలో మిగిలిన జేబీఎస్-ఎంజీబీఎస్ 10 కిమీల దూరం, ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.