ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు రూ.2లక్షల జరిమానా

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వైఖరికి హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిషార్కారాల ఫోరం రూ.2లక్షల జరిమానా విధించింది. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయడం వంటి కారణాలతో ఈ తీర్పు వెల్లడించింది. దాంతో పాటు రద్దు చేసిన విమాన టికెట్ ఛార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ కు చెందిన వినయ్ కుమార్ సిన్హా(57), కృష్ణ సిన్హా(5)దంపతులు టిక్కెట్లు బుక్ చేసి 2017 జులై 12న డెట్రాయిట్ లోని బంధువులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా.. బోస్టన్ నుంచి డెట్రాయిల్ కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది.
నిర్దారిత సమయంలో డెట్రాయిట్ కు చేరుకోవడంలో విఫలమైంది ఆ విమానం. పైగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేశారు. దీంతో వారిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. న్యాయ విచారణ పూర్తి అయి తీర్పు వెల్లడైంది.