రోడ్డుపైకి రావొద్దు : వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా

హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా
హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని సీపీ అంజనీకుమార్ చెప్పారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని సీపీ వెల్లడించారు. వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా 100కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30) వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరుగా, కొన్ని చోట్ల భారీగా వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వాహనదారులను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోత వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. తరుచుగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.