Hyderabad న్యూ సెల్ఫీ స్పాట్ ఇదే.. ఇక్కడొక చిక్కుంది

హైదరాబాద్ సిటీలో చూడడానికి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో.. తెలిసిన వారు సెల్ఫీ స్పాట్ లను కూడా క్షణాల్లో చెప్పేయగలరు. యాండ్రాయిడ్‌లతో తెరమీదకు వచ్చిన సెల్ఫీలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో కొత్తగా వెలసిన సెల్ఫీ స్పాట్ గురించి మాట్లాడుకుంటే..
ఖైరతాబాద్‌లో జీహెచ్ఎంసీ పాదచారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని ఈ ఏర్పాటు చేసింది. అంతేకాదు పబ్లిక్ డిమాండ్ మేరకు ఆ
స్పాట్ లో అర్థరాత్రి 2గంటల వరకూ వాటర్ ఫౌంటైన్, లైట్లు ఉంచాలనుకుంటున్నట్లు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ వెల్లడించారు.
అంతే కాదు ఆయన ట్వీట్‌లో ఐ లవ్ హైదరాబాదీ వాల్ ముందు నిల్చొని మీరు సెల్ఫీ తీసుకున్నారా అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే దీనిపై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. బిజీగా ఉండే ఏరియా ఖైరతాబాద్ లో సెల్ఫీ స్పాట్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెర్ట్ సీ రామచంద్రయ్య అన్నారు.
ఆ ఫుట్ పాత్ ప్రయాణికులు నిలబడి సెల్ఫీ తీసుకునేంత పెద్దగా లేదని.. దానిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. దీంతో పాటు పబ్లిక్ పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని లేదంటే వాహనదారులు అభద్రతా భావానికి గురవుతున్నారని వాపోతున్నారు.