కైట్ ప్లేయర్స్ కమాన్ : గాలిపటాలు ఎగరెద్దామా

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 07:07 AM IST
కైట్ ప్లేయర్స్ కమాన్ : గాలిపటాలు ఎగరెద్దామా

సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బమ్మలు, కోడి పందాలు, భోగి మంటలు, పిండి వంటలు. వీటన్నింటికంటే పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం పతంగులతోనే. ఈ కైట్ ఫెస్టివల్ గా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ లోని బైసన్ పోల్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భారీగా ప్లేయర్స్ వస్తున్నారు ఈసారి.
30 దేశాల నుంచి 100 మంది కైట్ ప్లేయర్స్ :
హైదరాబాద్ ఆకాశం రంగు మారుతోంది. పతంగులతో హరివిల్లులా మారుతోంది. 30 దేశాల నుంచి 100 మంది కైట్ ప్లేయర్స్ తరలివస్తున్నారు. రంగురంగుల పతంగులతో పేరేడ్ గ్రౌండ్స్ హరివిల్లులా మారనుంది. ఇందులో కోసం భారీ పతంగులు కూడా సిద్ధం అయ్యాయి. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, చోటా భీం, డోరాబుజ్జీ, మోడీ కైట్స్, రాహుల్ కైట్స్, కేసీఆర్, చంద్రబాబు, జగన్, అసదుద్దీన్ కైట్స్ ఇలా అన్ని రకాలవి సిద్ధం అయిపోయాయి. పెద్ద పెద్ద పతంగులను కూడా సిద్ధం చేశారు.

ఉపరాష్ట్రపతి చేతుల మీదగా ప్రారంభం :
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు లాంఛ్ చేస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్ లక్షల మంది హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ.