లెక్క తగ్గింది : రూ.లక్షా 46వేల 492 కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ వార్షిక బడ్జెట్ లెక్క తేలింది. ఈసారి బడ్జెట్ పరిమాణం తగ్గింది. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30

తెలంగాణ వార్షిక బడ్జెట్ లెక్క తేలింది. ఈసారి బడ్జెట్ పరిమాణం తగ్గింది. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2019 లెక్క తేలింది. ఈసారి బడ్జెట్ పరిమాణం తగ్గింది. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.1,46,492.30 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు. మూల ధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.67 కోట్లు. ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. సీఎం కేసీఆర్ సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
దేశంలో ఆర్థిక మాంద్యం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన ఏడాదిన్నరగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందని కేసీఆర్ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందని అన్నారు. 2019 తొలి త్రైమాసికంలో కేవలం 5శాతమే వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వెల్లడించారు. 11శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయిందన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించాల్సి వచ్చిందన్నారు.
ముందుగా వార్షిక బడ్జెట్ రూ.1.67 లక్షల కోట్ల నుంచి రూ.1.70 లక్షల కోట్ల మధ్య ఉంటుందని భావించారు. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ సైజు తగ్గించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ఈసారి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక పరిస్థితుల్లో కొంత ప్రతికూలత ఉన్నా వీటికి ప్రాధాన్యం తగ్గించకుండా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగాలపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం చూపకుండా నిధులను కేటాయించారు.