స్మార్టెస్ట్ గై అవార్డు గోస్‌ టూ : కేటీఆర్ ఫన్నీ ట్వీట్

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 10:33 AM IST
స్మార్టెస్ట్ గై అవార్డు గోస్‌ టూ : కేటీఆర్ ఫన్నీ ట్వీట్

కంచెలో ఉన్న ఫోన్ తీసుకోవడం కోసం ఇద్దరు యంగ్ గైస్ కష్టపడుతుండడం…వారి అమాయకత్వంతో ఉన్న ఓ వీడియోను చూసి తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వుకున్నారు. గతంలో మంత్రిగా..ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్..టీఆర్ఎస్‌ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. ప్రధానంగా ట్విట్టర్‌లో పొలిటికల్..ఇతరత్రా వాటిపై ట్వీట్ చేస్తుంటారు. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్‌లు విసురుతుంటారు. అభిమానులతో, ప్రజలతో ట్విట్టర్ వేదికగా టచ్‌లో ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. అప్పడప్పుడు సరదాగా కూడా నెటిజన్లతో సంభాషిస్తుంటారు. దీనితో కేటీఆర్‌కు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా కేటీఆర్ ఓ వీడియోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. నవ్వులు పూయిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. 

కంచెలో ఓ ఫోన్ పడి పోయి ఉంది. దానిని తీసుకోవడానికి ఇద్దరు కుర్రాళ్లు ప్రయత్నిస్తుంటారు. అందులో ఒకరు కర్రతో ఫోన్‌ను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అకస్మాత్తుగా కర్ర చేతిలో నుండి జారిపోతుంది. మరో వ్యక్తి కంచెలోకి దిగుతాడు. కర్రను పట్టుకొచ్చి అతనికి ఇచ్చేస్తాడు. ఆ వ్యక్తి షాక్‌కు గురవుతాడు. కంచె దిగి ఫోన్ తీసుకొస్తే ఏమవుతుండే ? అనే కొశ్చన్ మార్కుతో కూడిన ఫేస్ పెట్టాడు. దీనిని చూసిన కేటీఆర్ తెగ నవ్వుకున్నారు. స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ.. అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్లు కూడా తమ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. మరికొన్ని వీడియోలను కేటీఆర్‌కి రిప్లైగా నెటిజన్లు పోస్టు చేయడం విశేషం.