ఎల్బీ నగర్-మియాపూర్ రూట్ లో నిలిచిన మెట్రో రైలు

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 02:44 AM IST
ఎల్బీ నగర్-మియాపూర్ రూట్ లో నిలిచిన మెట్రో రైలు

Updated On : April 20, 2019 / 2:44 AM IST

మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైలు నిలిచింది. సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. నిన్న మాదాపూర్ మెట్రో స్టేషన్ లో రైలు నిలిచిపోయింది. గతంలోనూ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద మెట్రో రైలు అగిపోయింది.

విద్యుత్ పరఫరా, సిగ్నలింగ్, సాంకేతిక లోపంతోపాటు పలు కారణాలతో ఈడాది కాలంలో అధికంగా రైళ్లు ఆగిపోయాయి. నగర మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ లకు త్వరగా వెళ్లేందుకు ప్రజలు మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. మెట్రో లో వెళ్తే ట్రాఫిక్ సమస్య ఉండదని..తక్కువ సమయంలో ఆఫీస్ లకు వెళ్లొచ్చని భావిస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల కారణంతో మెట్రో రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.