తెలంగాణలో ఫామ్ 7 సమస్యలు లేవు: రజత్ కుమార్

తెలంగాణలో ఫామ్ 7 సమస్యలు లేవు: రజత్ కుమార్

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.. 10టీవీతో మాట్లాడారు. 

ఎన్నికలు ప్రశాంతంగానే సాగుతాయనే విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో ఫామ్ 7లాంటి సమస్యలేవి లేవని తెలిపారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్లు మిస్సయ్యాయని ఆరోపణలు వచ్చిన దానిపై స్పందించిన ఆయన.. కొద్ది రోజుల ముందే జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో అటువంటి ఫిర్యాదు లేమీ రాలేదని తిప్పికొట్టారు. ఎన్నికల పద్ధతి దాదాపు అంతకు ముందులాగే ఉంటుంది. 

‘కాకపోతే ఈ సారి ఓటర్లు పెరగడంతో పోలింగ్ బూత్ లు పెంచాలనుకుంటున్నాం. దీంతో పాటు సిబ్బంది కూడా ఎక్కువ అవసరముంటుంది. ఈ విషయమై సీఎస్ జోషీని కలిశా’ అని రజత్‌కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఆర్వోలు ఉన్నా.. ఏఆర్వో స్థానాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వాటిని భర్తీ చేసే విషయంపైనా సీఎస్‌తో చర్చించినట్లు వెల్లడించారు.