OMG : ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

OMG : ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

Updated On : March 26, 2019 / 1:22 PM IST

టెక్నాలజీతో పాటు ప్రయాణించాలని ఉన్నా ఏదో భయంతోనే అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన సంచలనం అయ్యింది. ప్యాంట్ జేబులోని సెల్ ఫోన్ పేలింది. ఒక్కసారిగా హీట్ రావటం.. ఆ వెంటనే పేలిపోవటం జరిగాయి. ఈ ప్రమాదం నుంచి బాధితుడు ప్రాణాలతో బయటపడినా.. తీవ్ర గాయాలు అయ్యాయి.

25ఏళ్ల వ్యక్తి రెండ్రోజుల క్రితం సెల్ఫీ స్పెషాలిటీగా ప్రచారం చేసుకునే బ్రాండ్ కు చెందిన ఫోన్ కొనుక్కున్నాడు బాధితుడు. కొత్త ఫోన్ తీసుకుని ఉదయం సమయంలో పనిమీద బైక్‌పై వెళ్తున్నాడు. ఫ్యాంట్ జేబులో ఉన్న ఫోన్ ఉన్నట్టుండి ఒకే సారి పేలింది.ఆ ప్రమాదానికి జేబు వెనక ఉన్న శరీరం కాలిపోయింది.

దీంతో కంగారుకు లోనైన వాహనదారుడు.. బ్యాలెన్స్ కోల్పోయాడు. రోడ్డుపై పడిపోవడంతో గడ్డం, కుడి చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబం తమ వ్యక్తి అదృష్టవంతుడని.. ఆ సమయంలో వెనుక నుంచి ఏదైనా వాహనం వస్తే ప్రాణాలతో దక్కేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల ముందు కొన్న ఫోన్ ఇలా జరగడంతో ఫోన్ వాడకంపై భయానికి లోనైయ్యారు.