Rains In Telangana: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన

తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains In Telangana: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం

మూడు రోజుల వరకు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా మారి, అదే ప్రదేశంలో కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ మహానగరంలో కూడా కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని అనేక చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అనేక నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు