ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే చర్చలు

ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 07:00 AM IST
ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే చర్చలు

Updated On : October 17, 2019 / 7:00 AM IST

ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు ప్రభుత్వం సూచించింది. అయితే కార్మికులు ఇప్పటివరకూ సమ్మె విరమించలేదు. దీంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 18, 2019) ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. కోర్టులో బలంగా వాదనలు వినిపించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

బుధవారం (అక్టోబర్ 16, 2019) దాదాపు నాలుగు గంటలపాటు దీనిపై అధికారులతో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్. అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. మరిన్ని అద్దె బస్సులను పెంచేందుకు యాజమాన్యం అడుగులు వేస్తోంది. 1035 బస్సులు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. 11 రీజియన్లలో అవసరమైన అద్దె బస్సుల వివరాలను అధికారులు సేకరించారు. మరోవైపు రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అర్టీసీ ఉన్నాతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 13వ రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. ఓ వైపు కార్మికులకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు చర్చలకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగియబోతోంది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ రివ్యూ జరిపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మతోపాటు మరికొందరు అధికారులతో నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించిన సీఎం… మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.