ఈసారి 1500 స్టాళ్లే.. ఫైర్ హైడ్రేట్లు : జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్

హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 09:45 AM IST
ఈసారి 1500 స్టాళ్లే.. ఫైర్ హైడ్రేట్లు : జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్

Updated On : December 22, 2019 / 9:45 AM IST

హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష

హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. సీపీ అంజనీకుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, భద్రత దృష్ట్యా ఈసారి 1500 స్టాళ్లకు మాత్రమే నుమాయిష్ లో అనుమతి ఇచ్చారు. అలాగే అగ్నిప్రమాదాలు జరక్కుండా చర్యలు చేపట్టారు. స్టాళ్ల మధ్య ఫైర్ హైడ్రేట్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నుమాయిష్ నేపథ్యంలో డిసెంబర్ 25 నుంచి ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నాంపల్లిలో ప్రతి ఏటా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) జరుగుతుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్. వేలాది మంది తరలి వస్తారు. కాగా 2019 జనవరిలో ప్రజలకు వినోదాన్ని పంచే  ఎగ్జిబిషన్‌లో పరిస్థితి విషాదకరంగా మారింది. జవనరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టాళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో సుమారు 50వేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 400 స్టాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వందల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.