తెలంగాణలో వడగండ్ల వాన

రోజు రోజుకి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా 2019, జనవరి

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 01:26 AM IST
తెలంగాణలో వడగండ్ల వాన

రోజు రోజుకి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా 2019, జనవరి

రోజు రోజుకి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా 2019, జనవరి 26, 27వ తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. అక్కడక్కడ వడగండ్లు పడే సూచనలు ఉన్నాయని చెప్పారు. హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. 26వ తేదీ శనివారం ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందన్నారు. హిందూ మహాసముద్రం-దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.