ప్రేమ వివాహం: నవ దంపతుల ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 07:48 AM IST
ప్రేమ వివాహం: నవ దంపతుల ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా ఉప్పల్ విషాద ఘటన జరిగింది. ప్రశాంత్ నగర్ లో నివాసముంటున్న నవ దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో వారి పేర్లు అనిత, రమేశ్ నాయుడులుగా పోలీసులు నిర్ధారించారు. 

ఈ  కేసు విషయంగా చుట్టుపక్కలవారిని విచారించగా వారు గత ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారనీ తేలింది. కాగా కేవలం ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నవీరు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కాగా విశాఖపట్నానికి చెందిన అనిత, రమేశ్ నాయుడులిద్దరు ప్రశాంత్ నగర్ లో ఉంటున్నారు. కానీ ఈ ఆరునెలలుగా  చుట్టుపక్కల ఎవ్వరితోను పెద్దగా మాట్లేడేవారు కాదు. దీంతో వీరి ఆత్మహత్యకు గల కారణాలు పెద్దగా ఎవ్వరికి తెలియలేదు. విభేదాల వల్లనే జరిగిందా లేదా ఇంకేమన్నా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరిద్దరి పేర్లు తెలుసుకోవటానికి పోలీసులకు రెండు గంటలు పట్టింది. ఈ క్రమంలో అనిత, రమేశ్ నాయుడు కుటుంబ సభ్యుల పేర్లు..వారి ఫోన్ నంబర్లు తెలుసుకున్న పోలీసులు వారికి సమాచారమిచ్చారు.