శరీరంపై పచ్చ బొట్టు: కేటీఆర్ అసంతృప్తి

ప్రేమను వ్యక్తపరిచే మార్గాలు చాలానే ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులపై సినిమా హీరోలపై వారి ప్రత్యేక అభిమానం చాటుకునేందుకు అభిమానులు కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తెలంగాణ యంగ్ లీడర్, మంత్రి కేటీఆర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని చాటుకున్న విధానంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
లేటెస్ట్‌గా ఓ అభిమాని తన శరీరంపై వీపు మీద కేటీఆర్ మాట్లాడుతున్నట్లుగా పచ్చబొట్టు వేసుకున్నాడు. దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా.. ఆ ఫోటో వైరల్ అయ్యింది. దానిని చూసిన కేటీఆర్.. ఫోటోను షేర్ చేస్తూ.. ఇది ఒకవేళ నిజమే అయితే.. ఇలాంటివి అస్సలు ఇష్టపడనని స్పష్టం చేశారు.
“సారీ బ్రదర్, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను” అంటూ ఆ వీరాభిమానికి రీప్లై ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇటువంటివి ఆరోగ్యకరమైనవి కాదు అని అన్నారు. రవికిరణ్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ రాగా.. కేటీఆర్ స్పందించారు.
Read More>>అధికారులు లంచం అడిగితే కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పండి
Is that for real!!!! ? Sorry brother but I don’t support or endorse these. It’s absolutely unhealthy and disturbing ? https://t.co/JlS7pqE7NO
— KTR (@KTRTRS) February 24, 2020