వీడని సస్పెన్స్ : టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకి కారణాలేమిటి
హైదరాబాద్ : సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగి 48 గంటలు కావొస్తున్నా పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

హైదరాబాద్ : సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగి 48 గంటలు కావొస్తున్నా పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
హైదరాబాద్ : సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగి 48గంటలు కావొస్తున్నా పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు ఏంటి? ప్రియుడు సూర్యతేజ ప్రమేయం ఎంత? అనే వివరాలు ఏవీ తేల్చలేదు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు, ఝాన్సీ ప్రియుడు సూర్యతేజను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ చెప్పారు.
ఈ కేసులో ఝాన్సీకి చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అవే కీలక ఆధారాలు. ఆమె కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నామని వివరించారు. చనిపోవడానికి ముందు ఝాన్సీ 14 వాట్సప్ మెసెజ్‌లు చేసినట్లు సమాచారం. వీటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ చేశారు. అందులో ఉన్న మెసేజేస్‌లో కొన్ని ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి వాటిని ఝాన్సీ డిలీట్ చేసినట్లు గుర్తించారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను టెక్నాలజీ సాయంతో తెలుసుకునే పనిలో పంజాగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా లాక్ ఓపెన్ అయిన ఫోన్‌లో పెద్దగా సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
ఝాన్సీకి చెందిన ఐ ఫోన్ ఫింగర్ ప్రింట్ లాక్‌తో ఉంది. దీంతో దాన్ని తెరవడం ఇబ్బందిగా మారింది. ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదని పోలీసులు చెప్పారు. దాని లాక్ తెరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. అది ఓపెన్ అయితే ఈ కేసులో మిస్టరీ వీడొచ్చని పోలీసులు నమ్మకాలు పెట్టుకున్నారు. సూర్య తేజ వేధింపులతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులకు మాత్రం అందుకు అనుగుణంగా సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్ లాక్ తెరిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
2019 జనవరిలోనూ ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫిబ్రవరి 5వ తేదీ ఆమె సూసైడ్ చేసుకుంది. శ్రీనగర్ కాలనీలో సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని ఝాన్సీ చనిపోయింది. ఝాన్సీ సూసైడ్ ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ ఆరోపించింది. ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. అయితే ఆ వీడియోలో ఏముందో పోలీసులు బయటకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఝాన్సీది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.