‘తరుణి ఫెయిర్’ : మహిళల కోసం ‘మెట్రో’ ఎగ్జిబిషన్
హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో అధికారులు మహిళలకు సాధికారిత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా మహిళల కోసం, మహిళల చేత మహిళా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో మెట్రో రైలు అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 60 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్.. మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు కానుందని..దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో మహిళా ఎగ్జిబిషన్ అత్యంత భారీగా ఏర్పాటు చేస్తామన్నారు.
Read Also : ఐడియా అదుర్స్ : ట్యాక్సీపై IPL లైవ్ స్కోరు
మహిళ సాధికారత పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని..ఈ ఎగ్జిబిషన్ లో మహిళలతో పాటు చిన్నారులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు లభించేలా స్టాల్స్ ఉంటాయని తెలిపారు. అలాగే ఎగ్జిబిషన్ ను సందర్శించే మహిళలను ప్రోత్సహించటం కోసం వారికి పలు రకాల కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తామని..ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
‘తరుణి ఫెయిర్’ ఫ్రీ ఎంట్రీ
మహిళా సాధికారతే లక్ష్యం ‘తరుణి ఫెయిర్’ పేరిట దేశంలోనే తొలిసారిగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మహిళా ఎగ్జిబిషన్ కు వచ్చే వారికి ఫ్రీ ఎంట్రీతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. దాదాపు 150 స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు కానున్నాయి. మహిళలు, చిన్నారులకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులు ఇక్కడి స్టాల్స్ లో దొరుకుతాయి. వివిధ రకాల దేశ, విదేశీ వంటకాల రుచులు అందించడానికి ఫుడ్‌కోర్టులు కూడా సిద్ధం చేయనున్నారు.
ఎగ్జిబిషన్ కు వచ్చేవారికి బోర్ కొట్టకుండా పలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు..చిన్నారులు కూడా ఎంజాయ్ చేసేలా ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్..గేమ్స్ వంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఫైర్ సేఫ్టీ తదితర అంశాల్లో అన్నీ జాగ్రత్తలు తీసుకోనున్నారు మెట్రో అధికారులు.
Read Also : భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం