Khairatabad Panchamukha Ganapati: ఖైరతాబాద్‌లో ‘పంచముఖ మహా గణపతి’.. గవర్నర్ దంపతుల తొలి పూజ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ నగరం వినాయక చవితి వేడుకల శోభతో వికసిస్తుండగా, విశ్వవిఖ్యాత ఖైరతాబాద్(Khairatabad Panchamukha Ganapati) మహాగణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- September 14, 2026 / 02:22 PM IST
telangana governor first puja for khairatabad panchamukha maha ganapati
- ఖైరతాబాద్ పంచముఖ గణపతి
- గవర్నర్ దంపతుల తొలి పూజ
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
Khairatabad Panchamukha Ganapati: హైదరాబాద్ నగరం వినాయక చవితి వేడుకల శోభతో వికసిస్తుండగా, విశ్వవిఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అత్యంత విశేషంగా 70 అడుగుల భారీ ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరిన బడా గణేశుడి వద్ద నగరవాసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల కోలాహలం నెలకొంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో తొలి పూజల ఘట్టం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
Vijay- Ajith: విజయ్ కి TVK సూట్ గిఫ్ట్ ఇచ్చిన అజిత్.. షాకైన తమిళనాడు సీఎం.. వైరల్ అవుతున్న పిక్స్
గవర్నర్ దంపతుల తొలి పూజ.. పట్టువస్త్రాల సమర్పణ:
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు విగ్రహం వద్దకు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి (Khairatabad Panchamukha Ganapati)మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించగా, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భారీ కండువా, యజ్ఞోపవీతం అలంకరించారు.
72 ఏళ్ల ఘన చరిత్ర.. భారీ భద్రతా ఏర్పాట్లు:
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 72 ఏళ్లుగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఖైరతాబాద్ గణేష్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని కొనియాడారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తుల రద్దీని దృష్ట్యా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
