కరెంట్ ఫుల్ : జల విద్యుత్ ఉత్పత్తిలో కొత్త రికార్డ్
తెలంగాణ రాష్ట్ర జలవిద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుదత్తు ఉత్పత్తి అయ్యింది.

తెలంగాణ రాష్ట్ర జలవిద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుదత్తు ఉత్పత్తి అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర జల విద్యుత్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. కృష్ణా నదికి వస్తున్న వరదలతో 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల విద్యుత్.. ఒకే రోజులోనే ఉత్పత్తి అయ్యింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే రోజు 32 ప్లాంట్ల ద్వారా 47.235 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కృష్ణాబేసిన్‌లో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువ ప్రాంతాల్లోంచి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి లక్షా 98వేల లక్షల క్యూసెక్కుల వరద ఆల్మట్టిలోకి వస్తుండగా.. 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపుర జలాశయానికి 2లక్షల 28వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. 2 లక్షల 42వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతుండటంతో జూరాల జలాశయానికీ భారీగా వరద కొనసాగుతోంది.
ఉజ్జయిని నుంచి కూడా 70 వేల క్యూసెక్కులకుపైగా బీమా ద్వారా కృష్ణాలో కలుస్తోంది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ఎత్తి 96వేల 546 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జూరాల, తుంగభద్రల ద్వారా వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతోంది.
Also Read : నిండుకుండలా నాగార్జునసాగర్.. 22 గేట్లు ఎత్తివేత