దొంగలకు సంక్రాంతి జోష్ : తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్
దొంగలకు సంక్రాంతి జోష్ : తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్ సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరాలకు నగరాలే ఖాళీ అయిపోతాయ్. నగరాలన్నీ ఊరుబాట పట్టేస్తాయి. ఇదే అదనుగా దొంగలు మరింతగా రెచ్చిపోయి చేతివాటానికి పదును పెడుతున్నారు. సందట్లో సడేమియాలా దొంగలు తాళాలు వేసిన వున్న ఇళ్లను టార్గెట్ చేసి పట్టపగలే చోరీలతో హల్ చల్ చేస్తు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

హైదరాబాద్: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరాలకు నగరాలే ఖాళీ అయిపోతాయ్. నగరాలన్నీ ఊరుబాట పట్టేస్తాయి. ఇదే అదనుగా దొంగలు మరింతగా రెచ్చిపోయి చేతివాటానికి పదును పెడుతున్నారు. ఇప్పటికే రైల్వేస్టేషన్‌లు, బస్ స్టేషన్‌లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సందట్లో సడేమియాలా దొంగలు తాళాలు వేసిన వున్న ఇళ్లను టార్గెట్ చేసి పట్టపగలే చోరీలతో హల్ చల్ చేస్తు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
ఈ క్రమంలో ఎల్బీ నగర్ జోన్‌లో నిన్నటిదాకా చైన్ స్నాచర్లు హడలెత్తించగా..తాజగా పట్టపగలు సంక్రాంతి సీజన్ దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో వనస్థలిపురంలో జనవరి 8న పట్టపగలే వరుసగా రెండు ఇళ్లలో 30 తులాల బంగారం, 4 లక్షల నగదును దోచేసారు. హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌లో మరో ఇంట్లో 60 తులాల గోల్డ్ లక్షల కొద్దీ క్యాష్ దోచేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లే నగర ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా దొంగతనాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో గల్లీ గస్తీ, పెట్రోలింగ్ మొబైల్స్, సీసీఎస్ సిబ్బంది మానిటరింగ్, ప్రతిస్టేషన్‌లోని డిటెక్టివ్ విభాగం గస్తీ, ఎస్‌ఓటీ నిఘా.. ఇలా అన్ని విభాగాల వారు డే అండ్ నైట్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేస్తు..అనుమానాస్పద వ్యక్తులతో పాటు పాత నేరస్తులపై నిఘా వేసారు.