టిక్ టాక్ పిచ్చి: జైలుకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ యువకులు

యువతరం కొత్త పుంతలు తొక్కుతుంది. మంచివైపు అయితే పర్లేదు.. కానీ అక్కరకు రాని, అవసరం లేని కొత్తదనం వైపు.. అయితే ఆ కొత్తదనం కాస్త ఇప్పుడు ఓ ఇద్దరు యువకులను చిక్కు్ల్లోకి నెట్టింది. హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువకులు టిక్‌టాక్ వీడియోల్లో వెరైటీ చూపించబోయి జైలుపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఈద్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు సంజూ, నితిన్.. టిక్‌టాక్ వీడియోలు చేసిన కారణంగా జైలుకు పొయ్యారు. అదేంటి టిక్ టాక్ వీడియోలు చేస్తే జైలుకు ఎందుకు పోతారు అనుకోకండి. నగరంలో లాక్‌డౌన్ అమలులో ఉండగా మద్యం షాపులను బంద్ చేశారు. ఎవ్వరికీ కూడా మద్యం దొరకని పరిస్థితి.
ఇటువంటి పరిస్థితుల్లో మందుబాబులకు మద్యం పోస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు యువకులు. అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. అవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడడంతో లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి మద్యాన్ని అక్రమంగా సరఫరా చేశారంటూ వారిపై కేసులు పెట్టించారు.
మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read | ఏపీలో కోవిడ్ వర్రీ : మోడీకి సీఎం జగన్ లేఖ