TS ICET 2022: తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ‘ఐసెట్’ ఫలితాలు రేపు (శనివారం) విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాల్ని విడుదల చేయబోతున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి వెల్లడించారు.
Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం
గత నెల 27, 28 తేదీల్లో కాకతీయ యూనివర్సీటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. తెలంగాణలోని 62 కేంద్రాల్లో, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 76,160 మంది దరఖాస్తు చేసుకోగా, 68,781 మంది విద్యార్థులు హాజరయ్యారు. 7,171 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఆగష్టు 4న పరీక్ష కీని విడుదల చేయగా, 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. నిజానికి ఈ నెల 22నే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక కారణాలతో 27కు వాయిదావేశారు.
Uddhav Thackeray: మరాఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్‌తో శివసేన పొత్తు.. ప్రకటించిన ఉద్ధవ్ థాక్రే
https://icet.tsche.ac.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాల కోసం హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల విడుదల సందర్భంగా కౌన్సెలింగ్ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.