P Chidambaram: ‘పార్లమెంట్ సుప్రీం’ కాదు.. రాజ్యాంగమే సుప్రీం: చిదంబరం
పార్లమెంటే సుప్రీం’ అంటూ తాజాగా ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్ ఇస్తూ ‘రాజ్యాంగమే సుప్రీం’ అని పేర్కొన్నారు.

New Chief Must Listen To Gandhis' Views says P Chidambaram
P Chidambaram: ‘పార్లమెంటే సుప్రీం’ అంటూ తాజాగా ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్ ఇస్తూ ‘రాజ్యాంగమే సుప్రీం’ అని పేర్కొన్నారు.‘‘పార్లమెంటే అత్యున్నతం అంటూ రాజ్యసభ ఛైర్మన్ చేసిన వ్యాఖ్య తప్పు. రాజ్యాంగమే అత్యున్నతం’’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
మున్ముందు ప్రమాదం ఉండబోతుందని దేశంలోని ప్రతి పౌరుడూ అప్రమత్తం అయ్యేలా రాజ్యసభ ఛైర్మన్ తీరు ఉందని చెప్పారు. ఒకవేళ పార్టమెంట్లో మెజార్టీ ఉందని పార్లమెంటరీ వ్యవస్థను అధ్యక్ష వ్యవస్థగా మార్చడం, రాష్ట్రాల ప్రత్యేక శాసన అధికారాలను తొలగించడం వంటి సవరణలు చేపడితే అవి చెల్లుతాయా? అని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేశాక కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు ప్రవేశపెట్టకుండా ఏదీ ఆపలేదని అన్నారు. ఒక్క దాన్ని కొట్టివేసినంత మాత్రాన భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్పనికాదని చెప్పారు. కాగా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ కు ఉండే సార్వ భౌమాధికారమే అత్యున్నతమైందని చెప్పారు.