‘గెహానా వశిస్ట్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేయలేదు.. ఒట్టి అమాయకురాలు’

‘గెహానా వశిస్ట్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేయలేదు.. ఒట్టి అమాయకురాలు’

Updated On : February 8, 2021 / 8:46 AM IST

Heroine Arrest: తెలుగు, బాలీవుడ్ హీరోయిన్, మోడల్ గెహానా వశిస్ట్ (వందనా తివారీ) పోర్న్ వీడియోలు షూట్ చేసి.. వాటిని వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిందనే ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. కేసు నమోదై ఆదివారం కోర్టులో హాజరుపరిచిన ఆమెను ఒట్టి అమాయకురాలని చెప్తున్నాడు ఆమె ప్రచారకుడు. Alt Balaji వెబ్ సిరీస్ గందీ బాత్ లో నటించిన గెహానా.. హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు, కొన్ని కమర్షియల్స్ లో కూడా కనిపించింది.

ప్రస్తుతం 87పొర్నోగ్రఫీ వీడియోలను తన వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిందని.. ఆ సబ్ స్క్రిప్షన్ కోసం రూ.2వేలు చెల్లించాలనే రూల్ కూడా ఉందని ఇంగ్లీష్ మీడియా ఒకటి రాసుకొచ్చింది. ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పలువురిపై కూడా కేసు నమోదైంది. డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ యాస్మిన్ బెగ్ ఖాన్, గ్రాఫిక్ డిజైనర్ ప్రతిభ నలావాడె, యాక్టర్ మోనూ గోపాల్ దాస్, అసిస్టెంట్ భానుసూర్యం ఠాకూర్, కెమెరా పర్సన్ మొహమ్మద్ ఆసిఫ్ లను పోలీసులు అరెస్టు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

అంతేకాకుండా మూడు బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.36లక్షల డబ్బును కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంచితే ఆమె పూర్తిగా అమాయకురాలు అని. ఎటువంటి పోర్న్ ఫిల్మ్ రాకెట్ లో ఇన్వాల్స్ అయి లేదని ప్రచారకర్త అయినటువంటి ఫ్లిన్ రెమెడియోస్ అంటున్నాడు. జీవీ స్టూడియోస్ ప్రొడ్యూసర్, డైరక్టర్ అయిన ఆమె.. కేవలం అనుమతులు ఉన్నటువంటి సినిమాలకే ప్రొడ్యూస్ చేసిందని.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ వాపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

బిజినెస్ కాంపిటీటర్స్ కావాలని పరువు పోగొట్టాలనే ఇలా చేస్తున్నారన్నాడు. మరికొద్ది రోజుల్లోనే న్యాయం రుజువవుతుందని.. మేం షూట్ చేసిన వీడియోలు అశ్లీలమైనవి కాదని ఆ క్యాటగిరీ వేరే ఉంటుందని అతను చెప్పుకొచ్చాడు.