ఆర్బీఐ రూ.5, రూ.10, రూ.100 నోట్లు బ్యాన్ చేసేదెప్పటి నుంచి..

this-is-what-rbi-has-to-say-about-old-rs-100-notes1
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమల్లో ఉన్న రూ.5, రూ.10, రూ.100నోట్లను ఇండియా వ్యాప్తంగా బ్యాన్ చేస్తుందా.. అనే ప్రశ్న ప్రపంచమంతా వినిపిస్తుంది. 2016లో చేసిన డీ మానిటైజేషన్‌తో రూ.500, రూ.1000నోట్లు బ్యాన్ అయిపోయాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సెంట్రల్ బ్యాంక్ రూ.5, రూ.10, రూ.100 నోట్లను నిషేదించేస్తుందంటూ.. ప్రచారం జరుగుతుంది.
ఆర్బీఐ ఈ మూడు నోట్లను మార్చి 2021 తర్వాతి నుంచి సర్క్యూలేట్ చేయడం ఆపేస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యాంక్ స్టాఫ్ అధికారికంగా చెప్తున్నారని సమాచారం.
నిజమేంటంటే..
దీనిపై ప్రముఖ సంస్థ నిజం తెలుసుకునేందుకు ప్రయత్నించింది. గవర్నమెంట్ వింగ్ ను సంప్రదించి తప్పుడు సమాచారంపై క్లారిటీ తీసుకుని క్లెయిమ్ ను కొట్టిపారేసింది. ఆ రిపోర్టు పూర్తి తప్పని తేలింది. ఆ తర్వాత రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి అనౌన్స్‌మెంట్లు చేయలేదని నిర్ధారించింది.
రాబోయే ఆర్థిక సంవత్సరం నాటికి నోట్లు బ్యాన్ చేసేస్తుందని చెప్పినవన్నీ అబద్ధమని తేలింది. దీనిని బట్టి ఇప్పట్లో ఈ చిన్న నోట్ల రద్దు అనేది జరగదని స్పష్టమైపోయింది.
एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3
— PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021