దర్శక దిగ్గజం శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

దర్శక దిగ్గజం శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

Updated On : January 31, 2021 / 12:57 PM IST

Director Shankar: దిగ్గజ దర్శకుడు శంకర్‌కు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ 2 నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆరూర్ తమిళ్‌నాదన్ అనే వ్యక్తి రాసిన కథనే రోబోగా చిత్రీకరించారంటూ వేసిన కేసుపై పలు వాయిదాలకు శంకర్ అటెండ్ అవలేదు. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన రోబో సినిమా కథ కాపీ కొట్టిందేననేది అసలు ఆరోపణ.

జిగుబా అనే టైటిల్ తో తమిళనాదన్ రాసిన స్టోరీ.. 1996లో పబ్లిష్ అయింది. కొన్నేళ్లుగా దీనిపై విచారణ జరుగుతుంది. రిపీటెడ్ గా కోర్టు ముందు హాజరుకావాల్సిన శంకర్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు.

తమిళనాదన్ కథ జిగుబా తమిళ మ్యాగజైన్ 1996లో పబ్లిష్ అయింది. దానిని ఢిక్ ఢిక్ దీపికా దీపికా అనే టైటిల్ తో 2007లో రీ పబ్లిష్ చేశారు. రిలీజ్ అయ్యాక శంకర్ తీసిన సినిమాను కాపీ చేశారంటూ.. వయోలేషన్ ఆఫ్ ద కాపీ రైట్ యాక్ట్, 1957కింద కంప్లైంట్ చేశారు. తన ఐడియాతో పెద్ద ఎత్తులో ఆర్థిక లాభం పొందారని ఆరోపించారు.

యంతిరన్ (రోబో) సినిమా 2010లో అత్యధిక ఇండియా ఫిల్మ్ రెండు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగులో రోబోగా, హిందీలో రోబోట్ గా డబ్బింగ్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో యంతిరన్ సినిమాలో హీరో కమ్ విలన్ గా రజినీ కనిపించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, డ్యానీ డెంజోగపా, సంతానం, కరునాస్ లతో పాటు ఇతరులు మరికొన్ని పాత్రల్లో కనిపించారు.

బ్రిలియంట్ సైంటిస్ట్ లీడ్ రోల్ లో నడిచే కథ.. వసీగరన్ సైంటిస్ట్ గా, రోబో పేరు చిట్టీగా నడుస్తుంది. వసీగరణ్ గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యరాయ్ కోసం రోబో రెచ్చిపోతూ చేసే పనుల నేపథ్యంతో సినిమా నడుస్తోంది.