Telangana governor Tamilisai: గర్భిణులు సుందరకాండ, పురాణాలు పఠించాలి…తెలంగాణ గవర్నర్ తమిళసై సలహా

గర్భిణీ స్త్రీలు తమ బిడ్డల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుందరకాండ పఠించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సలహా ఇచ్చారు. గవర్నర్ మాత్రమే కాకుండా గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ కూడా అయిన తమిళసై ఆదివారం ఈ సలహా ఇచ్చారు....

Telangana governor Tamilisai

Telangana governor Tamilisai : గర్భిణీ స్త్రీలు తమ బిడ్డల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుందరకాండ పఠించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సలహా ఇచ్చారు. గవర్నర్ మాత్రమే కాకుండా గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ కూడా అయిన తమిళసై ఆదివారం ఈ సలహా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ నిర్వహించిన ‘‘గర్భ సంస్కార్’’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. గర్భిణులు సుందరకాండతోపాటు రామాయణం, ఇతర పురాణాలు చదవాలని గవర్నర్ సూచించారు. దేశభక్తులు, సంస్కారులైన శిశువులకు జన్మనివ్వడానికి గర్భిణులకు శాస్త్రీయ, సంప్రదాయ ప్రిస్ర్కిప్షన్ ల సమ్మేళనాన్ని అందించాలన్నారు.

WFI chief Brij Bhushan: 2024 పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు

సంవర్ధినీ న్యాస్ అనేది రాష్ట్ర సేవికా సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి అనుబంధంగా ఉన్న మహిళా సంస్థ.వైద్యుల ప్రిస్క్రిప్షన్లలో భగవద్గీత వంటి మతపరమైన గ్రంథాలను చదవడం, సంస్కృత మంత్రాలను పఠించడం,యోగా సాధన వంటి కార్యకలాపాలు ఉన్నాయని తమిళసై చెప్పారు. ఇది గర్భధారణకు ముందు నుంచి ప్రసవం వరకు కాబోయే తల్లులు పాటించాలని కోరారు. గవర్నర్ ‘గర్భ సంస్కార్’ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడంలో సంవర్ధినీ న్యాస్ చేసిన ప్రయత్నాలను అభినందించారు. గర్భధారణకు ఈ శాస్త్రీయ సమగ్ర విధానం సానుకూల ఫలితాలను ఇస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Mumbai Fire Breaks Out: ముంబయి అగ్నిప్రమాదంలో 32మందికి గాయాలు

‘‘గ్రామాల్లో, రామాయణం, మహాభారతం ఇతర ఇతిహాసాలతో పాటు మంచి కథలను చదవడం మనం చూశాం. ముఖ్యంగా తమిళనాడులో గర్భిణీ స్త్రీలకు కంబ రామాయణంలోని సుందరకాండాన్ని చదవాలనే నమ్మకం ఉంది’’ అని ఆమె చెప్పారు.సుందరకాండ అనేది హిందూ ఇతిహాసం రామాయణంలో ఒక అధ్యాయం, ఇది హనుమంతుని సాహసాలను,అతని నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తిని వివరిస్తుందని చెప్పారు.

Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు

గర్భధారణ సమయంలో సుందర్‌కాండ పఠించడం శిశువులకు ప్రయోజనకరంగా ఉంటుందని సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు.గర్భధారణ సమయంలో యోగా సాధన చేయడం వల్ల కాబోయే తల్లి, బిడ్డ ఇద్దరి శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని, చివరికి సాధారణ ప్రసవానికి సహాయపడుతుందని గవర్నర్ పేర్కొన్నారు.