WFI Chief Brij Bhushan: 2024 పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు.....

WFI Chief Brij Bhushan: 2024 పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు

WFI chief Brij Bhushan

Updated On : June 12, 2023 / 11:56 AM IST

WFI Chief Brij Bhushan: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్, తాను ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గమైన కైసర్‌గంజ్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. (contesting 2024 Lok Sabha polls) ‘‘కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం సే చునావ్ లడుంగా’’ అని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఆదివారం తన మద్ధతుదారులతో బ్రిజ్ భూషణ్ ర్యాలీ తీశారు.

Mumbai Fire Breaks Out: ముంబయి అగ్నిప్రమాదంలో 32 మందికి గాయాలు

2024వ సంవత్సరంలోనూ మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్ కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆపై ఆయన బీజేపీ తీర్థం స్వీకరించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి, 1991, 1999 లోక్‌సభ ఎన్నికల్లో గోండా స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు. ప్రస్తుతం ఆయన ఆరోసారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా అగ్రశ్రేణి రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎందుకు మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని అడిగినప్పుడు, తాను కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నానని బ్రిజ్ భూషణ్ చెప్పారు.

Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు

కొద్ది రోజుల క్రితం బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీసులు 12 మంది వాంగ్మూలాలను నమోదు చేసేందుకు ఆయన ఇంటికి వచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్లు, చిరునామాలు, గుర్తింపు కార్డులను పోలీసులు సేకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్ సింగ్, తనపై ఒక్క ఆరోపణ అయినా రుజువైతే తాను ఉరివేసుకుంటానని చెప్పారు.