Mumbai Fire Breaks Out: ముంబయి అగ్నిప్రమాదంలో 32మందికి గాయాలు

మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 32 మంది గాయపడ్డారు.సెంట్రల్ ముంబయిలోని ధారవి స్లమ్ ఏరియాలో ఏడు అంతస్తుల నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒక నెల వయస్సు ఉన్న బాలుడితో సహా 32 మంది గాయపడ్డారు....

Mumbai Fire Breaks Out: ముంబయి అగ్నిప్రమాదంలో 32మందికి గాయాలు

Mumbai Fire Breaks Out

Updated On : June 12, 2023 / 5:10 AM IST

Mumbai Fire Breaks Out: మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 32 మంది గాయపడ్డారు.సెంట్రల్ ముంబయిలోని ధారవి స్లమ్ ఏరియాలో ఏడు అంతస్తుల నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒక నెల వయస్సు ఉన్న బాలుడితో సహా 32 మంది గాయపడ్డారు.(32 Hospitalised) క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.

Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు

90 ఫీట్ల రోడ్‌లో ఉన్న షామా భవనంలో(Mumbai Building) మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 80 మంది వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో భవనం మొత్తం కాలి బూడిద అయిపోయిందని అధికారులు పేర్కొన్నారు.భవనం గ్రౌండు ఫ్లోరులో మంటలు చెలరేగాయి. ఏడవ అంతస్తులోని స్ర్కాప్ మెటీరియల్ ఈ మంటల్లో కాలి పోయింది. అగ్నిమాపక శాఖ అధికారులు తమ వాహనాలతో వచ్చి మంటలను ఆర్పారు.

Pakistan Drones seized: సరిహద్దు జిల్లాలో బీఎస్ఎఫ్ కాల్పులు…రెండు పాక్ డ్రోన్ల స్వాధీనం

ఒక నెల వయస్సు ఉన్న బాలుడితో సహా క్షతగాత్రులందరినీ వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చారు. ఇద్దరు సీనియర్ సిటిజన్లు సియోన్ ఆసుపత్రిలో చేరగా, మరికొందరు ఆయుష్‌ ఆసుపత్రిలో చేరారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిమాపకశాఖ, పోలీసులు, ముంబై మున్సిపల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.