Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు
ఆస్ట్రేలియా దేశంలో పెళ్లి బృందం వెళుతున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 40 మంది వివాహ అతిథులతో తిరిగి వస్తున్న బస్సు రాత్రిపూట హంటర్ వ్యాలీ వైన్ కంట్రీ నడిబొడ్డున బోల్తా పడడంతో పది మంది మరణించారు....

Australia bus crashes
Australia bus crashes: ఆస్ట్రేలియా దేశంలో పెళ్లి బృందం వెళుతున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10మంది మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 40 మంది వివాహ అతిథులతో తిరిగి వస్తున్న బస్సు రాత్రిపూట హంటర్ వ్యాలీ వైన్ కంట్రీ(Hunter Valley) నడిబొడ్డున బోల్తా పడడంతో పది మంది మరణించారు.ఈ ప్రమాదంలో మరో 11 మంది గాయపడ్డారని, వారిని హెలికాప్టర్, రోడ్డు మార్గంలో ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.
Pakistan Drones seized: సరిహద్దు జిల్లాలో బీఎస్ఎఫ్ కాల్పులు…రెండు పాక్ డ్రోన్ల స్వాధీనం
ఈ ప్రమాదంలో మరో 18 మంది ప్రయాణికులు గాయపడలేదు.58 ఏళ్ల వయసున్న బస్సు డ్రైవరును పరీక్షల కోసం పోలీసు గార్డులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.గ్రేటా పట్టణంలోని వైన్ కంట్రీ డ్రైవ్‌లోని రౌండ్‌అబౌట్ వద్ద పొగమంచుతో కూడిన పరిస్థితుల్లో ఆదివారం రాత్రి 11.30 గంటల తర్వాత ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో క్రైం సీన్‌ను ఏర్పాటు చేశామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.అంతకుముందు వాండిన్ ఎస్టేట్ వైనరీలో జరిగిన వివాహానికి అతిథులు హాజరైనట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
Amit Shah : టార్గెట్ తెలంగాణ.. 15న ఖమ్మంకు అమిత్ షా, టూర్ షెడ్యూల్ ఇలా..
ఈ రోడ్డు ప్రమాదం భయంకరమైనదని సెస్నాక్ మేయర్ జే సువాల్ చెప్పారు. హంటర్ వ్యాలీలో ఒక ప్రధాన వివాహ, పర్యాటక ప్రదేశం.దీంతో రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి ప్రజలు హంటర్ వ్యాలీకి వస్తుంటారు.గ్రేటా హంటర్ వ్యాలీ వైన్ ప్రాంతం నడిబొడ్డున ఉంది. ఈ ప్రాంతం వైన్ యార్డులు, రెస్టారెంట్లతో నిండిన సుందరమైన ప్రాంతం కావడంతో వివాహాలు జరుగుతుంటాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఆస్ట్రేలియా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.