గుడి ప్రాంగణంలో 75ఏళ్ల పూజారి హత్య

Uttar Pradesh temple: సత్ప్రవర్తనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణంలోనే దారుణం జరిగింది. 75ఏళ్ల వయస్సున్న మత గురువునే హత్య చేశారు. యూపీలోని బదౌన్ జిల్లాలోని ఢాక్‌నగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సఖీ బాబా అనే వ్యక్తి 45ఏళ్లుగా గుడిలోనే ఉంటూ.. కాళీ మాత అవతారంలో చీర కట్టుకుని, గాజులు వేసుకుని సేవ చేసుకుంటున్నాడు.
రామ్‌వీర్ యాదవ్ అనే వ్యక్తిని నిందితుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. అరెస్టు చేసేందుకు గానూ పోలీస్ టీంలు తనిఖీలు చేపట్టాయి. హత్య వెనుక కారణంపై ఇంకా స్పష్టత రాలేదు. గుడి ప్రాంగణంలోనే సఖీ బాబా ఒంటరిగా ఉంటుండేవారు.
రెగ్యూలర్ ప్రార్థనల్లో భాగంగానే ఆదివారం ఉదయం కూడా గుడిలో గడిపిన బాబా సాయంత్రానికి అతని గదికి వెళ్లాడు. అక్కడే రామ్ వీర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనా ప్రదేశంలో నిందితుడ్ని కొందరు చూసినట్లుగా చెబుతున్నారు. అనుమానంతో వెళ్లి చూసేసమయానికి బాబా చనిపోయి నేలపై పడి ఉన్నాడు.
సీనియర్ ఎస్పీ సంకల్స్ శర్మ మాట్లాడుతూ.. సఖీ బాబాను స్థానికులెవరో కత్తితో పొడిచి హత్య చేశారు. రామ్ వీర్ అనే వ్యక్తి వ్యక్తిగత ద్వేషంతో ఇలా చేసి ఉండొచ్చు. సెక్షన్ 302ప్రకారం.. కేసు నమోదు చేశాం. నేరస్థుడ్ని త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తాం. హత్య వెనుక కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని హాస్పిటల్ కు అప్పగించామని అన్నారు.