కోహ్లీ డకౌట్.. ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంది గురూ!!

Virat Kohli: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా టీమిండియా చిదంబరం స్టేడియం వేదికగా రెండో టెస్టు ఆడుతుంది. శనివారం మ్యాచ్ మొదలైన రెండో ఓవర్లోనే వికెట్ తొలి వికెట్ గా శుభ్‌మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. ఆ సమయంలో వచ్చిన రోహిత్ శర్మ, చతేశ్వర్ పూజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 21వ ఓవర్లో జాక్ లీచ్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ అందుకోవడంతో రెండో వికెట్ గా పూజారా పెవిలియన్ బాట పట్టాడు.
అతని స్థానంలో వచ్చి కోహ్లీ.. అంతా సర్దుకుని ఒక్క పరుగు కూడా తీయకుండానే అవుట్… కెప్టెన్ కోహ్లీకి డకౌట్ గా వెనుదిరగడం వంతు అయింది. మొయిన్ అలీ బౌలింగ్ లో ఆఫ్ బ్రేక్ డెలివరీకి బంతి ఎగురుకుంటూ వెళ్లి స్టంప్స్ ను తాకింది. కవర్ డ్రైవ్ చేసి ఎదుర్కోవాలని ప్రయత్నించినా లాభం దక్కలేదు.
అంతే.. టెస్టు క్రికెట్ లో విరాట్ కోహ్లీ 11వ డకౌట్ నమోదైంది. శుభ్‌మన్ గిల్ కూడా డకౌట్ అవడం జట్టుకు నిరాశే మిగిలింది. ఆ తర్వాత దిగిన రహానె నిలదొక్కుకోవడంతో సెంచరీకి మించిన స్కోరు చేసిన రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. స్టోన్, జాక్ లీచ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.