Viral Video: అదరహో అనేలా గిరిజనుడి డ్యాన్స్.. న్యూ ఇయర్ వేళ వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర

ప్రపంచ దేశాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేసి అందరిలోనూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ‘‘నేను ఇవాళ రాత్రి 2022కి వీడ్కోలు పలుకుతూ ఇలా డ్యాన్స్ చేస్తాను. ఉక్రెయిన్ లో యుద్ధం, కరోనా విజృంభణతో నిండిపోయిన 2022 వెళ్లిపోతున్నందుకు సంతోషం. ఈ కొత్త ఏడాదిలో ఈ విపత్తులకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తూ...’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

Viral Video: అదరహో అనేలా గిరిజనుడి డ్యాన్స్.. న్యూ ఇయర్ వేళ వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర

Viral Video

Updated On : January 1, 2023 / 4:23 PM IST

Viral Video: ప్రపంచ దేశాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేసి అందరిలోనూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. ‘‘నేను ఇవాళ రాత్రి 2022కి వీడ్కోలు పలుకుతూ ఇలా డ్యాన్స్ చేస్తాను. ఉక్రెయిన్ లో యుద్ధం, కరోనా విజృంభణతో నిండిపోయిన 2022 వెళ్లిపోతున్నందుకు సంతోషం. ఈ కొత్త ఏడాదిలో ఈ విపత్తులకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తూ…’’ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

కాగా, 2022 డిసెంబరులో పలు దేశాల్లో కరోనా విజృంభణ మళ్ళీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై కొన్ని నెలలుగా రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విపత్తుకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో ఆఫ్రికాకు చెందిన గిరిజనులు చేసే సంప్రదాయ నృత్యాన్ని మనం చూడవచ్చు.

మైకల్ జాక్సన్ లా కాళ్లను అతి వేగంగా కదుపుతూ గిరిజన వ్యక్తి చేసిన డ్యాన్స్ అదరహో అనేలా ఉంది. అతడు డ్యాన్స్ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

India Prisoners In Pak: పాక్ జైళ్లలో భారత పౌరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇండియాలో అయితే..