new trend : కారు మీద ‘జస్ట్ డివోర్స్‌డ్’ అని రాసుకుని సంబరాలు చేసుకున్న వ్యక్తి.. ఇదో కొత్త ట్రెండు..

సరికొత్త విడాకుల ట్రెండ్ నడుస్తోంది. విడాకులు తీసుకుంటే విషాదంలో మునిగిపోనవసరం లేదని విడాకుల వేడుకలు జరుపుకుంటున్నారు. రీసెంట్‌గా ఓ పెద్దాయన తన విడాకుల సంబరాలు ఎలా జరుపుకున్నాడో చదవండి.

new trend : కారు మీద ‘జస్ట్ డివోర్స్‌డ్’ అని రాసుకుని సంబరాలు చేసుకున్న వ్యక్తి.. ఇదో కొత్త ట్రెండు..

new trend

Updated On : April 17, 2023 / 3:22 PM IST

new trend :  రీసెంట్‌గా ఓ లేడీ విడాకుల ఫోటో షూట్ వైరలైంది. ఇప్పుడు మగవారి వంతు వచ్చింది. ఓ వ్యక్తి కారులో తిరుగుతూ విడాకుల (divorce) సంబరాలు చేసుకున్నాడు. ఇదేం చోద్యం అంటే.. ఇదో సరికొత్త ట్రెండ్. వివరాలు చదవండి.

KTR : మంత్రి కేటీఆర్ స్వీట్ మెమరీస్.. చిన్ననాటి ఫోటో వైరల్

ఇటీవల కాలంలో వివాహ బంధం తెంచుకోవడానికి జంటలు పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఇష్టం లేని బంధం నుంచి చాలా సంతోషంగా బయటపడుతున్నారు. ఇటీవలే ఓ లేడీ తను సంతోషంగా విడాకులు తీసుకుంటున్నట్లు పెళ్లినాటి జ్ఞాపకాల్ని తగులబెడుతూ ఫోటో షూట్ చేసుకుంది. రీసెంట్‌గా అంగస్ కెన్నడీ (Angus Kennedy) అనే వ్యక్తి విడాకుల సంబరాలు చేసుకున్నాడు. 58 ఏళ్ల అంగస్ తన 23 ఏళ్ల వివాహ బంధానికి విచిత్రంగా గుడ్ బై చెప్పాడు. తన కారు మీద ‘జస్ట్ డివోర్స్‌డ్’ అని రాసుకుని డార్ట్ ఫోర్డ్ (Dartford), కెంట్ (Kent) ప్రాంతాల చుట్టూ తిరిగాడు. ఆసక్తి ఉన్న ఒంటరి మహిళలు సంప్రదించవచ్చని కూడా కారు మీద రాసి రిక్వెస్ట్ చేశాడు. అంగస్ అతని భార్య సోఫీ (Sophie) 2021లో విడాకుల కోసం అప్లై చేశారట. ఈ ఏడాది జనవరిలో వీరికి విడాకులు మంజూరయ్యాయి. పిల్లల పెంపకాన్ని కూడా ఇద్దరూ షేర్ చేసుకున్నారు. వృత్తి రీత్యా బ్యూటీషియన్ అయిన సోఫీ, అంగస్ ఒకే ప్రాంతంలో ఉన్నా ఎవరి దారిన వారు బతుకుతున్నారు.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

ఇక ఇప్పుడు ఇతని విడాకుల ప్రచారం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఇష్టంలేని బంధంలో సంవత్సరాల తరబడి ఉండేకంటే విడిపోవడమే ఉత్తమమని కొందరు.. ఈ వయసులో విడాకులు తీసుకోవడమే కాకుండా ఇంకో పెళ్లికి సిద్ధపడటం అవసరమా అని కొందరు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు.