Guinness Record : 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసినందుకు గిన్నిస్‌ రికార్డు

84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసినందుకు 100 ఏళ్ల వ్యక్తి గిన్నిస్‌ రికార్డు సాధించారు.

Guinness Record : 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసినందుకు గిన్నిస్‌ రికార్డు

100 Year Old Man Breaks Guinness World Record

Updated On : May 6, 2022 / 3:34 PM IST

100 years man 84 years job same company Guinness Record : జీతం పెరుగుతుందంటే చాలు కంపెనీ మారిపోతుంటారు ఉద్యోగులు. ఉద్యోగులు పలు కంపెనీలు మారటానికి కారణాలు చాలానే ఉంటాయి.చేసే పని నచ్చకో లేదా బాసులు వేధిస్తున్నారనో..లేదా జీతం చాలకో ఇలా ఎన్నో కారణాలుంటాయి. కానీ వాల్టర్‌ ఓర్త్‌మన్ అనే 100ఏళ్ల వ్యక్తి మాత్రం చాలా భిన్నంగా ఉన్నారు. వాల్టర్ 84 ఏళ్లుగా ఒకే కంపెనీలు పనిచేస్తున్నారు. 84 ఏళ్లుగా ఒకే కంపెనీలు పనిచేయటం అంటే మాటలు కాదు.అందుకే అతను గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. 84 ఏళ్లుగా ఒకే కంపెనీలు పనిచేస్తున్న వ్యక్తిగా వాల్టర్ గిన్నిస్ రికార్డు బుక్ లో తన పేరును ప్రతిష్టించుకున్నారు.

బ్రెజిల్‌కు చెందిన 100 ఏళ్ల కురు వృద్ధుడు వాల్డర్ ఓర్త్ మన్. ఈయన 84 ఏండ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ గిన్నెస్‌ రికార్డు నెలకొల్పారు. శాంటా కరాటినాలోని చిన్న పట్టణంలో జన్మించిన వాల్టర్‌ ఓర్త్‌మన్‌.. 1938లో తన 15వ ఏట ఓ టెక్స్‌టైల్‌ కంపెనీలో షిప్పింగ్‌ అసిస్టెంట్‌గా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే తన సహోద్యోగుల మధ్య వందో పుట్టినరోజు జరుపుకున్నారు. అత్యంత సుదీర్ఘకాలం అంటే 84 ఏళ్ల 9 రోజులు ఒకే కంపెనీలో పనిచేసిన వ్యక్తిగా గిన్నెస్‌ రికార్డు సాధించారు.

వాల్డర్ వర్షమైన బురదలో నడుచుకుంటూ స్కూల్ కు వెళ్లేవారట. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావట. స్కూల్లో పాఠం ఒక్కసారి వింటే చాలు గుర్తు పెట్టేసుకునేవారట.అద్భుతమైన జ్ఞాపకశక్తి గల వాల్డర్ నిరుపేద కుటుంబంలో జన్మించారు. చదువు అంటే చాలా ఇష్టం. వాల్టర్ కుటుంబం ఆర్థిక సమస్యలతో విలవిల్లాడేది.దీంతో వాల్డర్ తన 15 ఏటే కుటుంబం కోసం ఉద్యోగంలో చేరారు.అలా వాల్డర్ 1983లో ఇండ్రస్ట్రియాస్ రెనాక్స్ SA అనే వీవింగ్ మిల్లులో తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. జర్మన్ భాషలో వాల్డర్ చక్కటి ప్రావీణ్యం ఉండటంతో అతను టెక్స్ టైల్స్ కంపెనీలో షిప్పింగ్ అసిస్టెంట్ గా నియమించబడ్డారు.అప్పటినుంచి అదే కంపెనీలో పని చేస్తునే ఉన్నారు.

100 ఏళ్ల వయస్సులో ఉన్న వాల్డర్ ఇప్పటికీ ప్రతీ రోజు ఆఫీసుకు వెళతారు. గత నెల జరిగిన వాల్డర్ 100 పుట్టిన రోజును కుటుంబం, స్నేహితులతో పాటు ఆయన సహోద్యోగులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అలా వాల్డర్ 84 ఏళ్లు ఒకే కంపెనీలో పనిచేసినందుకు గిన్నిస్ బుక్ గుర్తించి రికార్డును నమోదు చేసింది. ఈ సందర్భంగా వాల్డర్ మాట్లాడుతూ..మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు సమయం మనకు తెలియకుండానే గడిచిపోతుంది అని అన్నారు.