100 Years Old Woman Bagged The Guinness World Record
100 years old woman bagged the guinness world record : 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు..40 ఏళ్లకే నడుమునొప్పులు. ఒక 50 ఏళ్ల వయస్తే అంతా అయిపోయింది ఈ వయస్సులో ఇంకేం చేస్తాం అంటూ రిలాక్స్ అయిపోతారు చాలా మంది.ముఖ్యంగా ఆడవాళ్లు. కానీకొంతమంది మాత్రం వయస్సులో సెంచరీలు దాటేసిన మాలో పస ఏమాత్రం తగ్గేదిలేదంటున్నారు. 100ఏళ్ల బామ్మ అవలీలగా బరువులు ఎత్తి అవతల పారేస్తోంది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ వెయిట్‌లిఫ్టర్ కాంపిటీటర్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. బరువులు ఎత్తటం నాకు నేనే సాటి..నాకెవరు లేరు పోటీ అంటోంది ఫ్లోరిడాకు చెందిన 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా అనే మహిళా మణి. కాదు కాదు మహిళా వజ్రం. సెంచరీ కొట్టినా నా సత్తా ఏమాత్రం తగ్గలేదంటున్నారు ముర్వే.
15 నుంచి 60 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ..100 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనత సొంతం చేసుకుని గిన్నీస్ రికార్డుల కెక్కెక్కారు. ముర్వే వయసులోఉన్నప్పుడు స్ధానిక రిక్రియేషనల్ సెంటర్‌లో డ్యాన్స్ టీచర్‌గా పనిచేసేవారామె. 91 ఏండ్ల వయసులో తన ఫ్రెండ్ కార్మన్ గట్‌వర్త్‌తో కలిసి వెయిట్ లిఫ్టింగ్ టైనింగ్ తీసుకున్నారు.90 ఏళ్ల వయస్సులో వెయిట్ లిఫ్టుంగ్ ట్రైనింగా?ఏం చేయటానికి? ఏం హాయిగా బతకాలని లేదా? ఎముకలు విరిగి మూలన పడుకోవాలని ఉందా?ఈ వయస్సులో ఏంటా కసరత్తులు అంటూ ఎంతోమంది ఆమెను అవహేళన చేసినా పట్టించుకోలేదు. వయస్సుకు తగినట్లుగా ఉండకుండా ఏంటా ఫీట్లు అన్నవారి నోళ్లు మూయించారు గిన్నిస్ రికార్డుతో ముర్వే.
ఎంతమంది ఎన్ని అన్నా పట్టించుకోలేదు. తన ఆశ..ఆకాంక్ష అర్థం చేసుకున్న ఫ్రెండ్ జిమ్‌లో జాయిన్ అయ్యారు. అలా చిన్న చిన్న బరువులు ఎత్తుతూ మెల్ల్ మెల్లగా బరువు పెంచుకుంటూ వెయిట్ లిఫ్టింగ్‌ను ట్రై చేసింది. మెల్లగా బరువులు ఎత్తడం నేర్చుకున్న ఆమె ఎక్కువ సమయంలో ట్రైనింగ్ లోనే గడిపేవారు.అలా చిన్న చిన్న బరువులు ఎత్తిపారేస్తూ ప్రొఫెషనల్‌గా మారిపోయారు
అలా సాటి వెయిట్ లిఫ్టర్లకు ఏమాత్రం తగ్గకుండా యువతకు కూడా సవాలు విసిరేలా తయారయ్యారు. అంకిత భావం, పట్టుదలతో ఎన్నో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని బహుమతులు సాధించారు. ఆమె పట్టుదలకు అంకిత భావానికి ఆ బహుమతులే నిదర్శనంగా కనిపిస్తాయి. ఈ సందర్భంగా 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా మాట్లాడుతూ..ఇష్టముంటే ఏదీ కష్టం కాదు. మీరు శ్రమపడినంత కాలం మీ వయసు ఎంతనేది మీకే గుర్తు రాదు. మీకు మీరేపోటీ అని అనుకోండీ అంటూ స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారామె. ట్రైనా వెయిట్‌లిఫ్టింగ్ వీడియో వైరల్‌గా మారగా బామ్మ పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.