Covid-19 INDIA: కొవిడ్‌పై పోరాటంలో ఇండియాకు సాయం చేస్తున్న 11దేశాలివే

కొవిడ్ 19 సెకండ్ వేవ్ అంతకుముందెన్నడూ లేని పరిస్థితులను చవిచూపిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించడంతో ...

Covid Second Wave: కొవిడ్ 19 సెకండ్ వేవ్ అంతకుముందెన్నడూ లేని పరిస్థితులను చవిచూపిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముందుగానే లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇంటి పట్టునే ఉన్నారు. కానీ, జీవన పోరాటంలో తప్పక సెకండ్ వేవ్ సమయంలో బయట తిరగాల్సిన పరిస్థితి. అలా వచ్చిన వారికి పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఎంతమందినని చూడగలదు.

కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం తీసుకునేందుకు ప్రపంచ దేశాలు తాము ఉన్నామంటూ ముందుకొచ్చాయి. అలా ఇండియాకు ఆపన్న హస్తం అందిస్తున్న 11దేశాలివే..

11. సౌదీ ఆరేబియా
ఇండియాకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తీసుకొచ్చారు. ఆక్సిజన్ సంక్షోభం ఉన్న సమయంలో ఈ సప్లై చాలా ఉపయోగపడుతుందని.. అదానీ గ్రూప్, లిండే కంపెనీల సహకారంతో షిప్మెంట్ చేశారు.

Saudi Arabia

10. పాకిస్తాన్
పొరుగుదేశమైన పాకిస్తాన్ కూడా కీలక సమయంలో ఇండియాకు చేయి అందించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు పాకిస్తాన్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. ‘ప్రస్తుత కొవిడ్ వేవ్ సమయంలో ఆదుకునేందుకు పాకిస్తాన్ బీఐపీఏపీ, డిజిటల్ ఎక్స్ రే మెషీన్లు, పీపీఈలు, వెంటిలేటర్లతో సహా అందించేందుకు రెడీగా ఉందని చెప్పారు.

Pakistan

9. చైనా
వ్యాక్సిన్ ముడి పదార్థాలను ఇండియాకు ఎగుమతి చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ నిరాకరించింది. ఆ తర్వాత చైనా.. ‘కరోనా వైరస్ పై పోరాడుతున్న సమయంలో ఇండియా గవర్నమెంట్ కు సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఇవ్వడానికి, ఇండియా అవసరాలు తీర్చడానికి మేం ముందుంటాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ శుక్రవారం అన్నారు. 2021 ఏప్రిల్ 25న హాంకాంగ్ ను 800ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను తీసుకొచ్చారు.

China

8. జర్మనీ
ఇండియాకు ఆక్సిజన్, మెడిసిన్స్ పంపేందుకు జర్మనీ రెడీగా ఉంది. కొవిడ్ 19 మహమ్మారి ని ఎదుర్కొనేందుకు హెల్త్ ఇన్ ఫ్రాస్టక్చర్ కోసం రెడీగా ఉన్నామని జర్మన్ విదేశాంగ మంత్రి హీకో మాస్ అన్నారు. 23ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను జర్మనీ నుంచి ఇండియాకు పంపబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఒక్కో ప్లాంట్ నిమిషానికి 40లీటర్ల ఆక్సిజన్, గంటలకు 2వేల 400 లీటర్లు ఇవ్వగలదు.

Germany

7. సింగపూర్
500 వెంటిలేటర్ అందించే మెషీన్లు (BiPAP)లు, 250 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర మెడికల్ సప్లైలను సింగపూర్ నుంచి 2021 ఏప్రిల్ 25న ముంబైకు తీసుకొచ్చారు. కొవిడ్ 19 సమయంలో మేం ఇండియాతో ఉన్నాం. ద్వైపాక్షిక, మల్టీ ఏజెన్సీ సహకారం అందించేందుకు రెడీగా ఉన్నాం. ట్రాన్స్ పోర్ట్ విమానాలు 4 క్రోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను సింగపూర్ నుంచి ఈ రోజు ఉదయమే తీసుకొచ్చాయంటూ శనివారం సింగపూర్ ప్రభుత్వం ట్వీట్ చేసింది.

Singapore

6. యునైటెడ్ స్టేట్స్
ఏప్రిల్ 2021.. 26వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను పంపిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. ప్రెసిడెంట్ జో బైడెన్ కరోనా వైరస్ కేసులతో సతమతమవుతోన్న ఇండియాకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. ‘గతంలో మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఇండియా సహకారం అందించింది. సాయం అవసరం ఉన్న సమయంలో ఇండియాతో మేము ఉంటాం’ అని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

United States

5. భూటాన్
అస్సాం హెల్త్ మినిష్టర్ హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆక్సిజన్ పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు భూటాన్ లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ రెమెడెసివర్ కొరత కూడా లేదని తెలిపారు. ఈ స్టాక్ ను పెంచాలని డ్రగ్ మేకర్ సన్ ఫార్మా నుంచి 80వేల వరకూ పెంచాలని రిక్వెస్ట్ చేశారు.

Bhutan

4. కెనడా
కెనడియన్ ప్రభుత్వం ఇండియాకు క్లిష్ట సమయాల్లో సాయం చేయడానికి ముందుకొచ్చింది. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు ఇస్తామని తెలిపింది. ఈ మేర కెనడా పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మినిష్టర్ అనితా ఆనంద్ మాట్లాడుతూ.. కెనడా ప్రభుత్వం ఇటువంటి క్లిష్ట సమయంలో ఇండియాకు సాయం చేసేందుకు సిద్ధమైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉపయోగకరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు అందించేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.

Canada

3. ఆస్ట్రేలియా
మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు దారుణంగా ఇబ్బంది పడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా దేశానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. పీపీఈలను, వెంటిలేటర్లను, ఆక్సిజన్ ను ఇండియాకు పంపిస్తాం. ఇండియా ప్రస్తుతం ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతుందని తెలిసింది.

Australia

2. యునైటెడ్ కింగ్‌డమ్
140 వెంటిలేటర్లు, 495 ఆక్సిజన్ జనరేటర్లను ఢిల్లీకి పంపింది యూకే ప్రభుత్వం. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాతో స్నేహితుడిలా, పార్టనర్ లా ఉండేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కోసం మహమ్మారితో పోరాడేందుకు యూకే సాధ్యమైనంత వరకూ సాయం చేస్తుందని అన్నారు.

United Kingdom

1. ఫ్రాన్స్
జర్మనీ, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ తో పాటుగా తాము ఉన్నామంటూ ముందుకొచ్చింది ఫ్రాన్స్. రాబోయే రోజుల్లో అవసరమయ్యే ఎక్స్ ట్రా ఆక్సిజన్ కెపాసిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ అధికారిక అకౌంట్లో.. ‘ఫ్రాన్స్ మెడికల్ ఎక్విప్మెంట్, వెంటిలేటర్లు, ఆక్సిజన్, 8ఆక్సిజన్ జనరేటర్లను ఇండియాకు పంపనున్నాం. ప్రతి జనరేటర్ హాస్పిటల్ లో పదేళ్ల పాటు ఆక్సిజన్ జనరేట్ చేయగలదు’ అని చెప్పింది.

France

ట్రెండింగ్ వార్తలు