నెంబర్ కోసమే : గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్

  • Publish Date - May 9, 2019 / 09:48 AM IST

కొన్ని కొన్ని ఘటనలు వింటే నవ్వొస్తుంది. నిజమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నిజమని తెలుసుకుంటే మాత్రం ఇదే వింతరా బాబూ అన్పిస్తుంది. గొర్రెలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వార్త. ఏంటి గొర్రెలకు స్కూల్లో అడ్మిషనా? అవేమన్నా చదువుకుంటాయా? చదువుకుని ఉద్యోగాలు చేయాలా? అని అనుకుంటున్నారా? నిజ్జంగా నిజమండీ బాబూ..ఇది ఎక్కడ అని వెంటనే డౌట్ వచ్చేసింది కదూ..చెప్పేస్తామండీ..ఫ్రాన్స్‌లోని అల్ప్స్ ప్రాంతంలోని క్రెట్స్ ఎన్ బెల్లెడోన్నె అనే గ్రామంలో జరిగింది. 

బెల్లెడోన్నె అనే గ్రామంలో ఓ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 11 క్లాసులు ఉన్నాయి. వీటిలో ఒక క్లాసులో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో క్లాసును క్లోజ్ చేసేయాలని స్కూల్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. అలా చేస్తే వారి విద్యాసంవత్సరం వేస్ట్ అవుతుంది. ఇది తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉపాయం లేని వారిని ఊరు నుంచి తరిమేయాలి అని సామెత. ఆ సామెతనే అనుసరించారు వీరందరూ. క్లాస్ నుమూసేయకుండా..ఉండేదుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. 

క్లాస్ లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 15 గొర్రెలకు పేర్లు పెట్టి..వాటిని ఆ క్లాసులోకి అడ్మిషన్స్ ఇప్పించారు. అంతేకాదు గొర్రెల జననధృవీకరణ పత్రాన్ని(బర్త్ సర్టిఫికెట్)  చూపించి మరీ పేర్లు రిజిస్టర్ చేయించారు. ఈ వింత నిరసనతో ఎట్టకేలకు తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల సంఖ్యపై కాకుండా.. వారి సంక్షేమం మీద శ్రద్ధ పెట్టాలని చురకలు అంటించారు. వాట్ యాన్  ఐడియా కదూ..!!