దుబాయ్‌లో 16ఏళ్ల భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటీవ్

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 10:19 AM IST
దుబాయ్‌లో 16ఏళ్ల భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటీవ్

Updated On : March 5, 2020 / 10:19 AM IST

దుబాయ్‌లోని 16ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. కొరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి ఈ వైరస్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)ను పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27కి చేరినట్లు ఆరోగ్య అధికారులు ప్రకటించారు. 

అసలు విషయమేంటంటే.. ఐదు రోజులు విదేశీ పర్కటనకు వెళ్లి ఇటివలే దుబాయ్ తిరిగొచ్చిన విద్యార్థి తల్లిదండ్రుల్లో కరోనా పాజిటివ్ అని తెలింది. వారి నుంచి ఆ బాలుడికి ఈ వైరస్ సోకిందని తెలిసింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని, అతడి తల్లిదండ్రులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

అంతేకాదు ఈ విద్యార్థి చదువుకునే విద్యా సంస్థను ముందు జాగ్రత్తగా గురువారం నుంచి  మూసివేస్తున్నట్టు దుబాయ్‌లోని ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి అధికారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.(ఒకటి కాదు..రెండు కరోనాలు! : రెండు రకాల వైరస్‌లను గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు)