20 కిలోల బంగారం : బాక్సులోంచి బైటికి తీస్తే మీదే

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 06:14 AM IST
20 కిలోల బంగారం : బాక్సులోంచి బైటికి తీస్తే మీదే

Updated On : March 29, 2019 / 6:14 AM IST

మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

ఏం చేసైనాసరే దక్కించుకోవాలని అనుకోనివారు ఎవరన్నా ఉంటారా చెప్పండి. మీక్కూడా  ఆ  20 కిలోల బంగారం కావాలంటే  దుబాయ్ వెళ్లాల్సిందే .అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఓ బాక్సులో ఉన్న బంగారాన్ని ఇలా చేయి పెట్టి అలా తీసేసుకోవటమే. ఎగిరి గంతేసి వెళ్లిపోదామనుకుంటున్నారా. మరి అదెలాగో తెలుసుకుందాం.

ఓ జ్యూలరీ సంస్థ పబ్లిసిటీ కోసం దుబాయ్ లోని ఓ విమానాశ్రయంలోని ఓ గ్లాసు డబ్బాను ఏర్పాటు చేసింది . ఆ బాక్సు లోపల 20 కిలోల బంగారం బిస్కెట్ ను పెట్టింది. బాక్సుకు ఓ రంథ్రాన్ని(హోల్) పెట్టారు. దాంట్లో చేయి పెట్టి బంగారాన్ని తీసుకోవటమే. జపాన్‌లోని ఓ మ్యూజియంలో కూడా ఇలాంటి బాక్సునే ఏర్పాటు చేశారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

అందులోని 12.5 కిలోల బంగారాన్ని ఓ వ్యక్తి విజయవంతంగా బయటకు తీయగలిగాడు. మరి  మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి.. తీస్తామనే నమ్మకం ఉంటే ట్రై చేయండి.. లక్కు ఉంటే దక్కుతుందేమో.. ప్రయత్నిస్తే పోయేదేముంది.. ఓ ప్రయత్నం తప్పా.. ఆల్ ది బెస్ట్..

ఈ బంగారాన్ని బయటకు తీసేందుకు పోటీపడుతున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #GoldBarLiftChallenge పేరుతో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్‌ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!