Sphinx statue : 2000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం

ఈజిప్ట్ లో పురాతన విగ్రహం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు 2 వేల ఏళ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్ లోని క్వెనా ప్రావిన్స్ కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు నవ్వుతున్న సింహిక విగ్రహం కనిపించింది.

Sphinx statue : ఈజిప్ట్ లో పురాతన విగ్రహం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు 2 వేల ఏళ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్ లోని క్వెనా ప్రావిన్స్ కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు నవ్వుతున్న సింహిక విగ్రహం కనిపించింది. ఆలయంలోని రెండంచెల సమాధి లోపల మందిరాన్ని తవ్వుతుండగా దాని అవశేషాల నుంచి విగ్రహం బయటపడింది.

దీన్ని రోమన్ శకానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. సున్నపురాయితో తయారు చేసిన ఈ విగ్రహం పురాతన రోమన్ చక్రవర్తి శైలికి ప్రతిరూపంగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇది గిజా పరిమిడ్స్ లోని సింహికతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంది. 41 నుంచి 54 ఏడీ వరకు రోమ్ ను పాలించిన క్లాడియస్ చక్రవర్తి పోలికలో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

పర్యాటక మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్ ఖాతాలో ఈ విగ్రహం ఫొటోలను షేర్ చేశారు. క్వెనాలోని దెవేంద్ర ఆలయంలో జరిపిన తవ్వకాల్లో సింహిక రూపంలో రోమన్ చక్రవర్తుల కాలానికి చెందిన విగ్రహం బయటపడిందని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక పురవాస్తు శాస్త్రవేత్తల బృందం రోమన్ కాలం నాటి ప్రార్థనా మందిరం, సున్నపురాయి టేబుల్ అవశేషాలను కూడా కనుగొన్నదని ఫేస్ బుక్ పోస్టు పేర్కొంది.

కైరోలోని ఐన్ షామ్స్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ తవ్వకాలను చేపట్టింది. ఈజిప్ట్ లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాలో హిడెన్ కారిడార్ బయటపడిన నేపథ్యంలో 2000 ఏళ్ల నాటి పురాతన విగ్రహాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు