జపాన్‌లో..2020 ’ఎలుక నామ’ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 

2020 నూతన సంవత్సరానికి స్వాగత పలకటానికి కొన్ని గంటల సమయమే ఉంది. నూతన సంత్సర వేడుకల్ని ఒక్కో దేశంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. జపాన్ లో 2020 సంవత్సరం రాక సందర్భంగా పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఉన్న ఓ దేవాలయం దగ్గర బంగారం రంగులో ఉన్న భారీ ఎలుక విగ్రహాన్ని నెలకొల్పారు జపాన్ వాసులు.

ఈ ఎలుక విగ్రహం ఎత్తు 3 మీటర్లు ఉంది. బంగారపు వర్ణంతో ఉన్న ఈ ఎలుక చేతిలో ఓ కాగడా కూడా ఉంది. ఇది 2020 సంవత్సరపు రాశి చిహ్నంగా భావించిన స్థానికులు ఈ ఎలుక విగ్రహాన్ని నెలకొల్పారు. కాగా 2020లో టోక్యోలో నిర్వహించే ఒలింపిక్స్, పారా ఒలింపిక్ గేమ్స్‌లో జపాన్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అక్కడి వారు భావిస్తున్నారు. దీనికి ప్రతీకగానే ఈ ఎలుక విగ్రహాన్ని మిసోటో పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ ఎలుక విగ్రహాన్ని తయారు చేసేందుకు నెల రోజులు పట్టిందని విగ్రహాన్ని తయారు చేసినవారు తెలిపారు.