2021 Ny1
2021 NY1 : భూమికి ముప్పు పొంచి ఉందా? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. 2021 ఎన్‌వై1 అనే గ్రహశకలం భూమి వైపుగా దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం సెప్టెంబర్ 22 న భూమికి అత్యంత సమీప దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది. 2021 ఎన్‌వై1 అత్యంత ప్రమాదం కల్గించే గ్రహశకలంగా నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం భూమి నుంచి 1,498,113 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా అంచనా వేసింది. ప్రస్తుతం ఈ గ్రహశకలం గంటకు 33వేల 660 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోంది.
WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?
స్కూల్ బస్ పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలాన్ని అపోలో క్లాస్ ఆస్టరాయిడ్‌గా నాసా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ఈ ఆస్టరాయిడ్ పరిమాణం సుమారు 0.127 కిమీ నుంచి 0.284 కిమీ వ్యాసంతో ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రహశకల గమనాన్ని నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఆస్టరాయిడ్ ప్రయాణిస్తున్న నిర్ణీత కక్ష్యను సిములేషన్ ద్వారా నాసా పర్యవేక్షిస్తుంది.
Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!
ఈ ఆస్టరాయిడ్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి సుమారు 1400 రోజులు పట్టనుంది. ఈ గ్రహశకలం మరో శతాబ్దం తరువాత భూమికి మరింత చేరువలో వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 2021 ఎన్‌వై1 గ్రహశకల గమనాన్ని 2021 జూన్ 12 నుంచి నాసా పర్యవేక్షిస్తుంది. కాగా ఈ గ్రహశకలం నుంచి భూమికి ప్రమాదం లేనప్పటికీ, అత్యంత ప్రమాదకర గ్రహశకల కేటగిరీలో ఈ ఆస్టరాయిడ్‌ను నాసా వర్గీకరించింది.