southern Montana: ధూళి తుపాను కారణంగా ఒకేసారి ఢీకొన్న21 వాహనాలు.. ఆరుగురు దుర్మరణం

అమెరికాలోని దక్షిణ మోంటానాలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ధూళి తుపాను కారణంగా వాహనాలు ఢీకొని ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

southern Montana: ధూళి తుపాను కారణంగా ఒకేసారి ఢీకొన్న21 వాహనాలు.. ఆరుగురు దుర్మరణం

America (1)

Updated On : July 16, 2022 / 2:42 PM IST

southern Montana: అమెరికాలోని దక్షిణ మోంటానాలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ధూళి తుపాను  కారణంగా వాహనాలు ఢీకొని ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బిల్లింగ్స్‌కు తూర్పున 50 మైళ్ల దూరంలో 3,800 మంది జనాభా ఉన్న హార్డిన్, మోంట్ వెలుపల ఇంటర్‌స్టేట్-90 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Amarica1

ఆరు ట్రక్కులు, సార్జంట్ సహా 21 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. మోంటానా హైవే పెట్రోల్ బంక్ ప్రతినిధి జే నెల్సన్ ఈ విషయాన్ని చెప్పారు. ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతుల పేర్లు, వయస్సు వివరాలను అధికారులు బహిర్గతం చేయలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి.

Ameirca

పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగి రోడ్డు కనిపించక పోవడం వల్ల వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గంటకు 96 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు బిల్లింగ్‌లోని నేషనల్ వెదర్ సర్వీస్‌లోని వాతావరణ శాస్త్రవేత్త నిక్ వెర్ట్జ్ తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. వాహనాలు ఢీకొని చెల్లా చెదురుగా  పడి ఉండటంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

America

సుమారు రాత్రి 9 గంటల వరకు తూర్పు వైపున ఉన్న దారులు మూసివేయబడ్డాయని, అధికారులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. “హార్డిన్ సమీపంలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని, ఆరుగురు మృతిపట్ల గవర్నర్ గ్రెగ్ జియాన్ఫోర్టే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ పోస్టు చేశారు.