చైనాలో కరోనా మృత్యుకేళి తీవ్రస్థాయికి చేరి భయాందోళనలకు గురిచేస్తోంది. హుబాయ్ ప్రావిన్సులో విషపూరిత వైరస్ వల్ల బుధవారం సెంట్రల్ ప్రావిన్స్ హుబీ కేవలం ఒక రోజులోనే (ఫిబ్రవరి 12,2020) 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకుంటేనే ప్రాణాలు హడలిపోతున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.
బుధవారం రోజునే కొత్తగా సుమారు 15వేల కరోనా కేసులు కూడా నమోదు అయ్యాయి. వీరిలో 8వేల 219మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటూ కరోనా వైరస్ మృతుల సంఖ్య 1 వేయి 369కు చేరింది.
కాగా.. హుబేయ్ కేంద్రంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు .. డబ్ల్యూహెచ్‌వో తాజాగా కోవిద్-19 అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సుమారు 60 వేల కోవిద్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడైంది. ప్రస్తుతం సుమారు 34 వేల మంది కోవిద్-19 వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు చైనా వార్త సంస్థలు వెల్లడిస్తున్నాయి.