మెక్సికో బార్ లో గ్యాంగ్ వార్ : 26 మంది మృతి

  • Publish Date - August 29, 2019 / 06:22 AM IST

బార్ లో  రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన ఘర్షణ 26మంది మృతికి కారణమైంది. రెండు గ్యాంగ్ ల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బార్ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటన అమెరికాలోని మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 23మంది ప్రాణాలో కోల్పోగా..మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళ వారం రాత్రి కోట్జాకోల్కోస్‌లోని వైట్ హార్స్ బార్‌లో మంటలు చెలరేగినట్టు అటార్ని జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

బార్ లో రెండు గ్యాంగ్ ల మధ్య వివాదం జరిగింది. దీంతో ఒక వర్గంలోని వ్యక్తి తుపాకీ కాల్పులు జరిపాడు. తరువాత మద్యం సీసాను పగులగొట్టి నిప్పంటించాడు. ఆ మంటలు బార్ అంతా వ్యాపించాయి. అతి కొద్ది సమయంలో జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బార్ లో ఉన్నవారు బైటకు వెళ్లేందుకు యత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఈ దాడికి పాల్పడిన వర్గం అప్పటికే బార్ ఎంట్రన్స్ డోర్ ను మూసివేశారు. దీంతో బైటకు వెళ్లేదారి లేక మంటల్లో కాలిపోయి 23మంది మృతి చెందారు. 

ఈ ప్రమాదంలో   మరో 13మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అటార్ని జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 8 మంది మహిళలతో పాటు 15 మంది పురుషులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించేందుకు గాలింపు చేపట్టినట్టు వెరాక్రూజ్ పబ్లిక్ సెక్యురిటీ సెక్రటరీ పేర్కొన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది అమానవీయ ఘటన అని..దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కన్నీటితో డిమాండ్ చేశారు.