యెమన్‌లో ఆకలి చావులు : ఈ ఏడాదిలో 4లక్షల మంది 5ఏళ్ల లోపు పిల్లలు షోషకాహార లోపంతో చనిపోవచ్చు!

Yemeni Children under 5 could die of Starvation : పోషకాహార లోపంతో లక్షలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా తీవ్రమైన పోషకాహారలోపం పెరిగిపోతోంది. దీని ఫలితంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 4లక్షల మంది యెమెన్ పిల్లలు ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని యుఎన్ ఏజెన్సీలు వెల్లడించాయి. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత 80శాతం జనాభా ఎక్కువగా పోషకహార సమస్యను ఎదుర్కొంటోంది. 2020 తో పోల్చితే యెమెన్‌లో 5 ఏళ్లలోపు పిల్లలలో తీవ్రమైన పోషకాహారలోపం 22శాతం పెరుగుతుందని ఏజెన్సీలు అంచనా వేశాయి.
అడెన్, హోడిడా, తైజ్ సనా దేశాలు ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతాలలో ఉన్నాయని నివేదిక తెలిపింది. యెమెన్‌లో సరైన పోషకాహారం లేకపోవడం వల్ల చిన్నారుల్లో ఆకలి కేకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం ఉన్న ప్రతి పిల్లవాడు బతికేందుకు జీవనం పోరాటం చేయాల్సి పరిస్థితి కనిపిస్తోంది. 2021లో 5 ఏళ్లలోపు ఉన్న మరో 2.3 మిలియన్ల మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపానికి గురవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేస్తోంది.
ప్రతి సంవత్సరం యెమెన్‌లో చిన్నపిల్లలు ఉన్న తల్లులలో తీవ్రమైన పోషకాహారలోపం పెరిగిందని తేలింది. ఈ ఏడాదిలో సుమారు 1.2 మిలియన్ల మంది గర్భిణీలు లేదా తల్లి పాలిచ్చే మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. యెమెన్‌లో కరువును అధికారికంగా ప్రకటించలేదు. ఆర్థిక క్షీణత, కరోనా మహమ్మారితో పాటు, గత సంవత్సరం విరాళాల కొరత కూడా తీవ్రతరం కావడంతో మానవతా సంక్షోభానికి దారితీసిందని అభిప్రాయపడింది.
తీవ్రమైన నిధుల కొరత మధ్య లక్షలాది మందిని ఆకలి బాధలను తీర్చే పోషకాహారం, ఇతర సేవలు క్రమంగా యెమెన్‌లో మూసివేస్తున్నాయి. 3.4 బిలియన్ డాలర్ల అవసరం ఉన్నప్పటికీ 1.9 బిలియన్ డాలర్లు మాత్రమే తమకు విరాళాలు అందాయని ఏజెన్సీలు తెలిపాయి.