Reservoir on Mars: అంగారక గ్రహంపై భారీ రిజర్వాయర్‌..45 వేల చదరపు కి.మీటర్ల పొడవైన జలాశయం

అంగారక గ్రహంపై నీటి జాడ కోసం పరిశోధిస్తున్న క్రమంలో శాస్త్రవేత్తల కృషి ఫలించంది. అంగారకుడిపై భారీ రిజర్వాయర్‌ ను గుర్తించారు. అది 45 వేల చదరపు కి.మీటర్ల పొడవైనది గుర్తించారు.

Huge reservoir on Mars : అంగారక గ్రహం (Mars)పై అత్యంత భారీ రిజర్వాయర్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రిజర్వాయర్ ఎంత పెద్దదంటే..ఏకంగా 45,000 కిలోమీటర్లు అంటే దాదాపు భారత్ లోని హర్యానా రాష్ట్రమంత పెద్దదని గుర్తించారు. కాగా..ఈ రిజర్వాయర్ గురించి తెలుసుకోవటంతో అంగారక గ్రహంపై నీటి జాడల్ని గుర్తించటంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేసినట్లు అయ్యింది.

మార్స్‌పై మంచు, నీటి జాడ కోసం పరిశోధకులు ఇన్నాళ్లూ ధృవాల్లో వెతికారు. గ్రహం గర్భంలో నీరు ఉండవచ్చని భావించి పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలు నిరంతరం కొనసాగగా ఈనాటికి నీటి జాడ తెలియవచ్చింది. అంగారకుడి భూమధ్యరేఖపై వాలేస్‌ మెరైనరీస్‌ అనే ప్రాంతంలో ఓ భారీ రిజర్వాయర్‌ను గుర్తించారు. లోయలతో కూడిన ఈ రిజర్వాయర్‌ లాంటి నిర్మాణం అంగారకుడి ఉపరితలానికి మీటరు లోతులో ఉంది. అది ఏకంగా 45 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దాదాపు హర్యానా రాష్ట్రమంత పెద్దగా ఉందని తెలిపారు. అక్కడ రిజర్వాయర్ లాంటిది ఉంది కాబట్టి ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read more : NASA Parker Solar Probe: సూర్యుడిని తాకిన NASA ఉపగ్రహం..అక్కడి విశేషాలు తెలుసుకుని షాకైన శాస్త్రవేత్తలు

మార్స్ మట్టిలో హైడ్రోజన్‌..
మార్స్‌పై నీటి అన్వేషణకు రష్యా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటర్‌(టీజీవో)ను పంపించారు. దీనిలోని ‘ఫ్రెండ్‌’ టెలిస్కోప్‌ ఈ రిజర్వాయర్‌ను గుర్తించింది. అంగారకుడి మట్టిలోని రసాయనిక మూలకాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా..ఆ మట్టిలో భారీగా హైడ్రోజన్‌ ఉన్నట్టుగా గుర్తించారు. గతంలో నీటి నిల్వల వల్లే ఈ లక్షణం ఉండొచ్చని తెలిపారు. ‘టీజీవోతో మార్స్‌ ఉపరితలాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ ఒయాసిస్‌ లాంటి ప్రాంతాన్ని ఎక్కడా గుర్తించలేదు’ అని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఐగర్‌ మిత్రోఫనోవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read more : Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

ట్రెండింగ్ వార్తలు