ఐదుగురి ప్రాణాలు తీసి.. 114 మందిని ఆసుపత్రిపాలు చేసిన జపాన్ మెడిసిన్స్

Japanese health supplements: పెద్ద మొత్తంలో కంపెనీ ప్రాడెక్టులను రీకాల్ చేశామని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే..

ఐదుగురి ప్రాణాలు తీసి.. 114 మందిని ఆసుపత్రిపాలు చేసిన జపాన్ మెడిసిన్స్

Japanese

ఐదుగురి ప్రాణాలు తీసి.. 100 మందికి ఆసుపత్రిపాలు చేశాయి జపాన్ మెడిసిన్స్. ఆ ఔషధాలను వారం రోజుల క్రితమే సంబంధిత ఫార్మా కంపెనీ రీ కాల్ చేసింది. ఒసాకాకు చెందిన కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన కొలెస్ట్రాల్ తగ్గించే మందులు బెని కోజి ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్న వారు అస్వస్థతకు గురయ్యారు.

జనవరిలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ, మార్చి 22 వరకు దీనిపై అధికారికంగా కంపెనీ ప్రకటన చేయలేదు. ఆ మందు తీసుకున్న కొందరు కిడ్నీ సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రెసిడెంట్ అన్నారు. పెద్ద మొత్తంలో కంపెనీ ప్రాడెక్టులను రీకాల్ చేశామని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని జపాన్ ప్రభుత్వం తెలిపింది.

కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ కొన్నేళ్లుగా బెని కోజీ ఉత్పత్తులను అమ్ముతోంది. మూడేళ్లలో లక్షల కొద్దీ మందులు అమ్మింది. 2023లో ఉత్పత్తి చేసిన సప్లిమెంట్‌లలోనే సమస్య ఉందని ఆ కంపెనీ తెలిపింది. గత ఏడాది మొత్తం 18.5 టన్నుల బెనికోజీని ఉత్పత్తి చేసినట్లు వివరించింది.

Also Read: సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు